By Election : దేశ వ్యాప్తంగా మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల..!

దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

By Election : దేశ వ్యాప్తంగా మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల..!
X

న్యూస్ లైన్ డెస్క్ : దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో (7 States ) 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఎన్నికలు, 13వ తేదీన ఓట్ల ఓట్ల లెక్కింపు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఉప ఎన్నికలు జూలై 14న నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు. 21 తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారని, 24వ తేదీన పరిశీలిస్తామని తెలిపారు. అయితే 26 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ అని అధికారులు తెలిపారు. కాగా ఈ (By Elections) ఉప ఎన్నికలు బిహార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో వివిధ కారణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు జరుగుతాయి. బిహార్ లోని రుపాలి, పశ్చిమబెంగాల్ లోని రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్ (ఎస్సీ), బాగ్దా (ఎస్సీ), మాణిక్తలా, తమిళనాడులోని విక్రవాండి, మధ్యప్రదేశ్ లోని అమర్వారా(ఎస్టీ), ఉత్తరాఖండ్ లోని బద్రినాథ్, మంగ్లౌర్, పంజాబ్ లోని జలంధర్ పశ్చిమ(ఎస్సీ), హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్‌పూర్, నలాగర్ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.

Tags:
Next Story
Share it