HYD OU: ఓయూలో సీఎం దిష్టి బొమ్మ దహనం

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పలుచోట్ల నిరసనలకు దిగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మాదిగలను పట్టించుకోవడంలేదంటూ మండిపడుతున్నాయి.

HYD OU: ఓయూలో సీఎం దిష్టి బొమ్మ దహనం
X

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పలుచోట్ల నిరసనలకు దిగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మాదిగలను పట్టించుకోవడంలేదంటూ మండిపడుతున్నాయి. మాదిగలు కేవలం ఓట్లు వేయడానికి పరిమితం అనుకుంటున్న సీఎం రేవంత్‌కి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతాం అంటున్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (MSF) సీఎం దిష్టిబొమ్మను దహనం చేసింది. తెలంగాణలో అధిక శాతం ఉన్న మాదిగలకు ఒక్క ఎంపీ సీట్ కూడా కేటాయించలేదన్నారు. సీఎం కేవలం రెడ్లకు మాత్రమే టికెట్లిస్తున్నారన్నారు.

Tags:
Next Story
Share it