War: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో భారతీయుడు మృతి

గాజాపై ప్రతీకార దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ బలగాలు మరోసారి యుద్దాన్ని మరింత తీవ్రతరం చేశాయి.

War: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో భారతీయుడు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: గాజా(Gaza)పై ప్రతీకార దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌(Israel) బలగాలు మరోసారి యుద్దాన్ని మరింత తీవ్రతరం చేశాయి. గాజాలోని రఫా(Rafa) నగరంపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఐక్యరాజ్యసమితి(UN)లో పనిచేస్తున్న ఓ భారతీయుడు మృతిచెందాడు. యునైటెడ్‌ నేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ (DSS) విభాగంలో పనిచేస్తున్న ఆ వ్యక్తి యూరోపియన్ హాస్పిటల్ కు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఘటనాస్థలంలోనే అతను ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

అయితే, ఈ ఘటనపై స్పందించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్‌.. DSS సభ్యుడు మరణించడం చాలా బాధాకమని ట్వీట్ చేశారు. గాజాలో యుద్ధం కారణంగా ఇప్పటివరకు 190 మందికి పైగా UN సిబ్బంది మరణించారని తెలిపారు. మానవతా కార్యకర్తలకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. UN సిబ్బందిపై జరిగిన అన్ని దాడులను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. కాల్పుల విరమణ పాటించాలని, బందీలందరినీ విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:
Next Story
Share it