Telangana: న్యూజిలాండ్ లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు

ఈ వేడుకలకు న్యూజిలాండ్ దేశ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Telangana: న్యూజిలాండ్ లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు
X

న్యూస్ లైన్ డెస్క్: నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా తెలంగాణ ప్రజలు జరుపుకున్నారు. కాగా, న్యూజిలాండ్ దేశం ఆక్లాండ్ పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు న్యూజిలాండ్ దేశ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తెలుగులో తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర సాధన కోసం ఎందరో అమరవీరులు చేసిన త్యాగాల గురించి మాట్లాడారు. ప్రస్తుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Tags:
Next Story
Share it