Tamil Nadu: లారీని ఢీకొట్టిన బస్సు.. నలుగురు మృతి

తమిళనాడులో (tamil nadu) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఓ బస్సు (bus) అతివేగంతో లారీని (lorry) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురి మృతి చెందగా.. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Tamil Nadu: లారీని ఢీకొట్టిన బస్సు.. నలుగురు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: తమిళనాడులో (tamil nadu) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఓ బస్సు (bus) అతివేగంతో లారీని (lorry) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురి మృతి చెందగా.. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై- తిరుచ్చి జాతీయ రహదారిపై (chennai-trichy national highway) మదురాంతకం వద్ద (maduranthakam) బస్సు అతివేగంతో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అది గమనించిన స్థానికులు క్షతగాత్రులను చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it