Etala rajender: ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష్య పదవి..?

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. దీంతో ఈటల రాజేందర్ కాస్త నిరాశ చెందారు.

Etala rajender: ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష్య పదవి..?
X

న్యూస్ లైన్ డెస్క్: మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajendar)కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, కేంద్ర మంత్రి వర్గంలో చోటు కోసం ఆయన ఆశించిన విషయం తెలిసిందే. కానీ, ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. దీంతో ఈటల రాజేందర్ కాస్త నిరాశ చెందారు. అయితే, ఇదివరకు కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న ఆయనతోనే అధ్యక్ష పదవిని కొనసాగించే అవకాశం కూడా లేదు. దీంతో ఈ పదవిలో ఈటల రాజేందర్‌‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇతరుల పేర్లను కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది.

ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనేత అమిత్ షా(Amit Shah)తో ఈటల సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు అమిత్ షాతో ఈటల ఈరోజు భేటీ అయ్యే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, వీరి భేటీ ముగిసిన తర్వాత ఈ అంశంపై పూర్తి స్పష్టత రానుంది.

Tags:
Next Story
Share it