Nara Lokesh:పెళ్లికి ముందే నారా లోకేష్ కు లవ్ స్టోరీ ఉందా..?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలామందికి చంద్రబాబు కొడుకు గా తెలుసు.. ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉండేవారు.

Nara Lokesh:పెళ్లికి ముందే నారా లోకేష్ కు లవ్ స్టోరీ ఉందా..?
X

న్యూస్ లైన్ డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలామందికి చంద్రబాబు కొడుకు గా తెలుసు.. ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉండేవారు. కానీ కొన్ని సంవత్సరాలుగా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్నారని చెప్పవచ్చు. యువగళం పాదయాత్ర పేరుతో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

అలాంటి నారా లోకేష్ లో కేవలం మనం రాజకీయ యాంగిల్ ను మాత్రమే చూశాం. కానీ తాజాగా ఆయనలో ఉన్నటువంటి లవ్ యాంగిల్ కూడా బయటకు వచ్చింది. ఆయన పాదయాత్రలో భాగంగా హలో లోకేష్ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సాదాసీదాగా అందరితో కలిసిపోయారు. ఈ సభకు హాజరైనటువంటి కార్యకర్తలు కాలేజీ స్టూడెంట్స్ తో సరదాగా గడిపారు. ఈ తరుణంలోనే ఒక కాలేజీ విద్యార్థిని నారా లోకేష్ కు ఒక ప్రశ్న వేసింది.. బ్రాహ్మణి గారితో పెళ్లి ప్రస్తావన మొదట ఎవరు తీసుకొచ్చారు. మీకు పెళ్లికి ముందు ఏమైనా లవ్ స్టోరీ ఉందా అనే విధంగా క్వశ్చన్ వేసింది..

దీంతో నారా లోకేష్ ఏ మాత్రం ఆలోచించకుండా మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అన్నారు.. దీంతో సభా వేదిక అంతా అరుపులు, నవ్వులతో కళకళలాడిపోయింది. నేను అమ్మానాన్నతో కలిసి ఒక వెకేషన్ కి వెళ్ళిన సమయంలో ఈ విషయం చెప్పారు.. నా అభిప్రాయాన్ని అడిగారు.. నేను ఓకే చెప్పగానే బ్రాహ్మణి కూడా ఒప్పుకుంది. అంతేకాకుండా మరో విద్యార్థిని మీ ఫస్ట్ క్రష్ ఏంటి అని అడగ్గా.. లోకేష్ నవ్వుతూ కాలేజీలో చేయాల్సిన వెదవ పనులన్నీ చేశా.. అందరిలాగే నాకు కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. అలాంటివి చెబితే ఏటీఎం బ్యాచ్ ఎగబడి ట్రోల్ చేస్తుందని చెప్పుకొచ్చారు.. ఈ విధంగా లోకేష్ తన లవ్ స్టోరీ గురించి చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:
Next Story
Share it