Nellore : బాలిక పై మృగాడి అత్యాచారం..5 ఏళ్ళు జైలు శిక్ష!

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, జంగాల కండ్రిగ అనే గ్రామానికి చెందిన మల్లిఖార్జున అనే 42 ఏళ్ళ వ్యక్తి 2018 వ సంవత్సరం లో 7 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేసాడు.

Nellore : బాలిక పై మృగాడి అత్యాచారం..5 ఏళ్ళు జైలు శిక్ష!
X
న్యూస్ లైన్, నెల్లూరు : నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, జంగాల కండ్రిగ అనే గ్రామానికి చెందిన మల్లిఖార్జున అనే 42 ఏళ్ళ వ్యక్తి 2018 వ సంవత్సరం లో 7 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేసాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేసారు అప్పట్లో. 8 వ అదనపు జిల్లా కోర్టులో ఐదేళ్ల నుండి నడుస్తున్న ఈ కేసు కి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. నిందితుడికి 5 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పుని ఇచ్చింది. నేరం సాక్ష్యాధారాలతో సహా నిరూపితం అవ్వడం తో జడ్జి సిరిపిరెడ్డి సుమ ముద్దాయికి 5 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తు, 20 వేల రూపాయిలు జరిమానా విధించారు. దీంతో బాలిక తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేసారు. కానీ శిక్ష మరింత కఠినంగా ఉండుంటే బాగుండేది, మరో మృగాడికి ఇలాంటి ఆలోచనలు రావాలంటే వణుకు పుట్టే స్థాయిలో శిక్ష ఉండాలి అని నెటిజెన్స్ అంటున్నారు.
Tags:
Next Story
Share it