APPSC GOOD NEWS: 7 నోటిఫికేషన్లు విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే!

APPSC: ఏపీపీఎస్సీ నుండి 7 నోటిఫికేషన్లు విడుదల

APPSC GOOD NEWS: 7 నోటిఫికేషన్లు విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే!
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ(APPSC ) ద్వారా వివిధ ఉద్యోగ ప్రకటనలు జారీచేసింది. కాగా, గడిచిన డిసెంబర్‌ ఒక్క నెలలో ఏకంగా ఏడు ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది. 21,637 ఉద్యోగాల భర్తీకిగాను.. డిసెంబర్‌ 31వ తేదీ నాటికి 1,423 పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల అయ్యాయి. మిగిలిన పోస్టులకు సంబంధించి ఉద్యోగ ప్రకటనలు కూడా విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఏపీపీఎస్సీ(APPSC) వెలువరించిన ఉద్యోగ ప్రకటనల వివరాలలోకి వెళితే..

-గ్రూప్‌-1 ద్వారా 81 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తుంది. మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష జరుగుతుంది.

-గ్రూప్‌-2 ద్వారా 897 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. డిసెంబర్‌ 21 నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ పరీక్ష జరుగుతుంది.

- 99 పాలిటెక్నిక్‌ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏప్రిల్/ మేలో పరీక్ష ఉంటుంది.

-38 డీఈవో పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 1 నుంచి జనవరి 29 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏప్రిల్‌ 13 న ప్రిలిమ్స్‌ పరీక్ష జరుగుతుంది.

-21 ఏఈఈ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏప్రిల్/ మేలో పరీక్ష ఉంటుంది.

-47 జూనియర్‌ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏప్రిల్/ మేలో పరీక్ష ఉంటుంది.

-240 డిగ్రీ లెక్చరర్‌ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏప్రిల్/ మేలో పరీక్ష ఉంటుంది.

Next Story
Share it