Anakapalli : న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పేరిట మద్యం సేవించిన 7వ తరగతి విద్యార్థులు!

అనకాపల్లి జిల్లా చోడవరం బాలుర వసతి గృహంలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పేరిట మందు కొట్టిన 7వ తరగతి విద్యార్థులు.

Anakapalli : న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పేరిట మద్యం సేవించిన 7వ తరగతి విద్యార్థులు!
X

Newsline, Anakapalli : నేటి తరం పిల్లలు అన్నీ విషయాల్లో చాలా ముందు ఉన్నారు. అది మంచి విషయాల్లో అయినా, చదువు విషయాల్లో అయినా, చివరికి చెడు అలవాట్ల విషయం లో అయినా. న్యూ ఇయర్ రోజున ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి ప్రాంతం లో జరిగిన ఒక సంఘటన చూస్తే ఎటు పోతుంది ఈ సమాజం అని అనిపించక తప్పదు. అసలు విషయం లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం లోని ఒక బాలుర వసతి గృహం లో న్యూ ఇయర్ రోజున 7వ తరగతి విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. సంబరాలు చేసుకోవడం లో తప్పేమి ఉంది అని మీరు అనుకోవచ్చు, కానీ వీళ్ళ సంబరాల్లో మద్యం కూడా సేవించారు. దీనిని చూసి ఆశ్చర్యపోయిన ఒక వ్యక్తి వీడియో తీస్తుండడం గమనించిన ఈ 7వ తరగతి విద్యార్థులు, అతని పై మూకుమ్మడిగా దాడి చేసారు. ఇంత జరుగుతున్నా కూడా ఆ హాస్టల్ వార్డెన్ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇంత చిన్న వయస్సులో వీళ్ళు ఇలాంటి దారిన పడడానికి కారణం తల్లి తండ్రులా, లేదా గురువులా అనేది తెలియడం లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:
Next Story
Share it