Tirumala : శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఎలుగుబంటి హల్ చల్

తిరుమల శ్రీవారి సన్నిధిలో నిత్యం ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటూనే ఉంది. నిన్నటి వరకు చిరుత పులి

Tirumala : శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఎలుగుబంటి హల్ చల్
X

Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో నిత్యం ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటూనే ఉంది. నిన్నటి వరకు చిరుత పులి సంచారంతో జనాలు భయపడిపోగా..ఇప్పుడు ఎలుగు బంటి ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఇవాళ ఉదయం శ్రీవారి 2000వ మెట్టు దగ్గర భక్తుల కంటపడింది ఓ ఎలుగుబంటి. దీంతో ఎలుగు బంటిని చూసి భయంతో పరుగులు తీశారు భక్తులు.

ఇక అటు భక్తుల అరుపులకు భయపడిపోయిన ఎలుగు బంటి కూడా.. అడవి అరణ్యంలోకి పారిపోయింది. ఇక భక్తుల అరుపులతో.. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు...ఎలుగుబంటి ఎటు వెళ్లిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, తిరుమలలో రెండు రోజుల కిందట లక్ష్మిత అనే నెల్లూరు కు చెందిన చిన్నారిని చిరుత దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే..రెండు రోజుల కిందట తిరుమలలో బాలికపై దాడిచేసి చంపేసిన చిరుత చిక్కింది. తిరుమల- అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది.

Tags:
Next Story
Share it