Roja Selvamani : మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల

సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలను పోషించి అనతి కాలం లోనే సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రోజా.

Roja Selvamani : మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల
X

న్యూస్ లైన్ డెస్క్: సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలను పోషించి అనతి కాలం లోనే సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రోజా. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె సినీ కెరీర్ ఎన్నో ఒడిదుడుగులు, ఎత్తుపల్లాలు మధ్య కొనసాగింది. మొదటి నుండి సామజిక స్పృహ ఉన్న రోజా ప్రజాసేవ చెయ్యడం కోసం తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. నగరి స్థానం నుండి టీడీపీ ద్వారా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన రోజా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లో చేరింది.

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్ స్థాపించిన వైసీపీ లో చేరి అదే నగరి స్థానం నుండి రెండు సార్లు పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందింది. అలా అటు సినీ జీవితం లోను, ఇటు రాజకీయ జీవితం లోను ఎన్నో ఆటుపోట్లను ఎదురుకొని మగవాళ్ళతో సమానంగా ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన రోజా జీవిత చరిత్ర గురించి 'రంగుల ప్రపంచం నుండి రాజకీయాల్లోకి' అనే పుస్తకం ప్రచురితం అయ్యింది. ఈ పుస్తకాన్ని నేడు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు విడుదల చేసారు.

Tags:
Next Story
Share it