AP CRIME : పింఛన్ సొమ్ముతో జూదమాడి.. అడ్డంగా బుక్కయిన వాలంటీర్ !

వృద్దుల పించన్ సొమ్ముతో జూదమాడి.. దొంగలు దోచుకున్నారని నాటకమాడి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వాలంటీర్.

AP CRIME :  పింఛన్ సొమ్ముతో జూదమాడి..  అడ్డంగా బుక్కయిన వాలంటీర్ !
X

AP CRIME : వృద్దుల పించన్ సొమ్ముతో జూదమాడి.. దొంగలు దోచుకున్నారని నాటకమాడి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వాలంటీర్. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా విడపనకల్లు గ్రామ వాలంటీర్ ఆగస్టు ఒకటో తేదీన వైఎస్ఆర్ పెన్షన్ డబ్బులను అధికారుల నుంచి 89 వేల రూపాయలను తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులను లబ్ధిదారులకు పింఛన్ల రూపంలో ఇవ్వకుండా... కర్నూలు జిల్లా గుమ్మనూరుకు వెళ్లి అక్కడ పింఛన్ డబ్బులతో జూదం ఆడాడు.

ఈ నేపథ్యంలో పింఛన్ డబ్బులతో పాటు చేతికి ఉన్న బంగారం మరియు సెల్ఫోన్ కూడా పోగొట్టుకున్నాడు ఆ వాలంటీర్. దీంతో విషయం బయటపడకుండా కట్టుకత అల్లాడు. పింఛన్ డబ్బులను తీసుకొని గ్రామానికి వెళుతుండగా ఇద్దరు దుండగులు... కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి తీసుకువెళ్లి బెదిరించి దారి దోపిడీ చేశారని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. అయితే ఆ వాలంటీర్ చెప్పిన విధానం పోలీసులకు అనుమానం రావడంతో... అతన్ని గట్టిగా విచారించడంతో అసలు విషయం బయటపడింది.

Tags:
Next Story
Share it