Breaking News: వైఎస్ విజయమ్మకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి వైఎస్‌ విజయమ్మకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.

Breaking News: వైఎస్ విజయమ్మకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
X


న్యూస్ లైన్,Breaking News: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి వైఎస్‌ విజయమ్మకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె కారులో ఒంగోలుకు బయలుదేరింది. మార్గమధ్యలో సంతమంగళూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ అప్లై చేశాడు. దీంతో వెనుక వేగంగా వస్తున్న ఆమె కాన్వాయ్ లోని కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొట్టుకున్నాయి. కాగా.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న విజయమ్మ, ఆమెతో ఉన్న తదితరులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది.

ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్, షర్మిలా ఫోన్ చేసి విజయమ్మ క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం వైఎస్. తెలంగాణలో 119 స్థానాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుందని షర్మిల మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. షర్మిల పాలేరు, మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తున్నారని ఆమె అన్నారు. దీంతో పాటు వైఎస్ విజయమ్మ, అనిల్ కూడా పోటీ చేయవచ్చని ఆమె అన్నారు.

Tags:
Next Story
Share it