Siddham : కోటికి పైగా వ్యూస్..15 లక్షల మంది జనం..అద్దంకి 'సిద్ధం' సభ ప్రభంజనం!

జగన్ సిద్ధం సభలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒక నలుగురు ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారంటే, అది సిద్ధం సభ గురించే అయ్యి ఉంటుంది.

Siddham : కోటికి పైగా వ్యూస్..15 లక్షల మంది జనం..అద్దంకి సిద్ధం సభ ప్రభంజనం!
X

న్యూస్ లైన్, అద్దంకి : జగన్ సిద్ధం సభలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒక నలుగురు ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారంటే, అది సిద్ధం సభ గురించే అయ్యి ఉంటుంది. ఆ రేంజ్ మేనియా ని సృష్టించారు సీఎం జగన్. సీఎం జగన్ ప్రభంజనం ధాటిని భరించలేక ఒకటి కాదు, రెండు కాదు , ఏకంగా మూడు పార్టీలు ఏకం అయ్యాయి. ఢిల్లీ నుండి నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా కచ్చితంగా గెలుస్తాము అనే నమ్మకం లేకుండా పోయింది. సీఎం జగన్ కి జనాల్లో ఉన్న ఆదరణ అలాంటిది. ఇకపోతే నేడు అద్దంకి లో జరిగిన సిద్ధం సభ ఊహించిన దానికంటే పెద్ద హిట్ అయ్యింది. రాజకీయ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ సభకి దాదాపుగా 15 లక్షల మంది వచ్చారట. ఇది రాజకీయ చరిత్ర లోనే ఒక సంచలన రికార్డుగా చెప్తున్నారు.

అంతే కాకుండా సిద్ధం సభని కేవలం సోషల్ మీడియా ద్వారా వీక్షించిన వారి సంఖ్య కోటి కి పైగానే ఉంటుందని సమాచారం. కేవలం సాక్షి ఛానల్ లోనే లైవ్ గా లక్ష మందికి పైగా చూశారట. సినిమా ఆడియో ఫంక్షన్స్ కి కూడా ఈ రేంజ్ లైవ్ వ్యూస్ ఇప్పటి వరకు రాలేదు. ఇక గూగుల్ లో సిద్ధం అనే పాదంతో వెతికిన నెటిజెన్స్ సంఖ్య కూడా కోటికి పైగానే ఉంటుందట. ఈ స్థాయిలో ఒక సభని నిర్వహించడం కేవలం జగన్ కి మాత్రమే సాధ్యం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. సీఎం జగన్ 16 వ తేదీ నుండి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. 175 నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేస్తే టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీల అడ్రస్ గల్లంతు అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:
Next Story
Share it