Amaravati : బీజేపీ తో పొత్తు టీడీపీ - జనసేన కి నష్టం చేస్తుందా?

పొత్తు లేకపోతే టీడీపీ పార్టీ కి మనుగడ లేదా..?, పొత్తు వల్లనే ఆ పార్టీ ఇంకా కొనసాగుతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ నుండి చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలతో పొత్తు లేకుండా తెలుగు దేశం పార్టీ గెలిచిన హిస్టరీ లో ఎక్కడా లేదు.

Amaravati : బీజేపీ తో పొత్తు టీడీపీ - జనసేన కి నష్టం చేస్తుందా?
X

న్యూస్ లైన్, అమరావతి : పొత్తు లేకపోతే టీడీపీ పార్టీ కి మనుగడ లేదా..?, పొత్తు వల్లనే ఆ పార్టీ ఇంకా కొనసాగుతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ నుండి చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలతో పొత్తు లేకుండా తెలుగు దేశం పార్టీ గెలిచిన హిస్టరీ లో ఎక్కడా లేదు. ఒక్క 2019 లోనే ఒంటరిగా పోటీ చేసింది. ఫలితం ఎంత దారుణంగా వచ్చిందో ప్రజలందరూ చూసారు. దీంతో ఇప్పుడు ఆయన టీడీపీ జనసేన తో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో పోటీ చెయ్యబోతున్నారు. ఇది ఇలా ఉండగా చంద్రబాబు నాయుడు అత్యధిక సార్లు పొత్తు పెట్టుకున్నది బీజేపీ తోనే. 1999, 2004, 2014ల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత 2018 లో బీజేపీ పార్టీ తో విభేదించి బయటకి వచ్చేసారు.

ఆ సమయం లో చంద్రబాబు మోడీ, అమిత్ షా పై చేసిన వ్యక్తిగత విమర్శలు సాధారణమైనవి కావు. అందుకే చంద్రబాబు తో పొత్తు పెట్టుకోవడం ఆర్ఎస్ఎస్ పార్టీ నేతలకు అసలు ఇష్టం లేదు. ఇక ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నాయకులకు కానీ క్షేత్ర స్థాయిలో ఉండే కార్యకర్తలకు కానీ టీడీపీ కలిసి వెళ్లడం ఏ మాత్రం నచ్చలేదు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖం చూసి అమిత్ షా పొత్తు కి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. టీడీపీ వాళ్లకు కూడా బీజేపీ తో వెళ్లడం ఇష్టం లేదు. బీజేపీ తో పొత్తుని వారు మొదటి నుండి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా లో అమిత్ షా ని, నరేంద్ర మోడీ ని ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు. అంతే కాకుండా బీజేపీ ని కలిపిన పవన్ కళ్యాణ్ మీద కూడా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. దీంతో ఈ కలయిక చూసిన రాజకీయ విశ్లేషకులు ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్న వ‌ధూవ‌రుల కాపురం ఎలా సాగుతుందో నేడు ఏపీలో ఎన్డీయే ప్ర‌యాణం కూడా అలాగే సాగుతుంది అంటూ వెట‌కారం చేస్తున్నారు.

Tags:
Next Story
Share it