Amaravati : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతే !

వైసీపీ సర్కార్‌ కు కేంద్రం మరోసారి షాక్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై మోడీ ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతి అని

Amaravati : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతే !
X

అమరావతి : Amaravati is the capital of Andhra Pradeshవైసీపీ సర్కార్‌ కు కేంద్రం మరోసారి షాక్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై మోడీ ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతి అని వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రి కౌశల్ కుమార్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.

దీంతో పాటు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో కేవలం త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు మాత్రమే మాస్టర్ ప్లాన్ లు లేవని కౌశల్ కుమార్ తెలిపారు. మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా మాస్టర్ ప్లాన్లు ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు. వీటిని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందన్న మంత్రి కౌశల్ కుమార్ అమరావతికి సైతం మాస్టర్ ప్లాన్ ఉందని, దీనిని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆయన తెలిపారు.

Tags:
Next Story
Share it