ambati rambabu : ఏపీ ప్రభుత్వం చర్య నాయమైంది..

ఏపి ప్రభుత్వం చర్య నాయమైనదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సాగర్ పై ఏపీ పోలీసుల దండయాత్ర అని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

ambati rambabu : ఏపీ ప్రభుత్వం చర్య నాయమైంది..
X

ఏపి చర్యను సమర్థించిన మంత్రి రాంబాబు

న్యూస్ లైన్, డెస్క్ : ఏపి ప్రభుత్వం చర్య నాయమైనదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సాగర్ పై ఏపీ పోలీసుల దండయాత్ర అని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణతో తమకు ఇంట్రెస్ట్ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాలు వేరు తమ రాజకీయాలు వేరని అన్నారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు మేంటైన్ చేస్తున్నామని చెప్పారు. తమ వాటాకు మించి ఒక్క బొట్టు నీళ్లు కూడా తెలంగాణకు ఇవ్వమని చెప్పారు.

శ్రీశైలం పవర్‌ను అతిగా తెలంగాణ వినియోగించుకుంటుందని ఆరోపించారు. సాగదర్ నీళ్లు విడుదల చేయాలంటే తెలంగాణ పర్మిషన్ కావాలని అన్నారు. తమ భూబగంలో ఉన్న గేట్లను మాత్రమే తాము లేపామని అన్నారు. కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయని అవి తనను బాధ కలిగిస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం వాళ్లు ఈ విషయంలో ఫేయిల్ అయ్యారని అన్నారు. జగన్ ప్రభుత్వం పాస్ అయ్యిందని అన్నారు.

కృష్ణా జలాల్లో 66 శాతం నీరు తమదని చెప్పారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రభుత్వం హక్కులను తాకట్టు పెట్టారని చెప్పారు. కేసులకు భయపడి తెలంగాణకు లొంగారని వ్యాఖ్యానించారు.

Tags:
Next Story
Share it