Ambati Rambabu: ఖమ్మంలో ఏపీ మినిస్టర్‌కు చేదు అనుభవం

తెలంగాణ(Telangana)లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. సీఎం కేసీఆర్(CM Kcr) పర్యటనకు కొన్ని గంటల ముందు ఖమ్మం(Khammam)లో ఊహించని పరిస్థితి నెలకొంది.

Ambati Rambabu: ఖమ్మంలో ఏపీ మినిస్టర్‌కు చేదు అనుభవం
X

Ambati Rambabu: తెలంగాణ(Telangana)లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. సీఎం కేసీఆర్(CM Kcr) పర్యటనకు కొన్ని గంటల ముందు ఖమ్మం(Khammam)లో ఊహించని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా పోలీసులు(Police) అప్రమత్తమయ్యారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ జనాల్లోకి వెళ్తున్నాయి. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల(Voters)ను పలకరిస్తున్నాయి. నేతలంతా రోడ్ షో(road show)లు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కూడా రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పాలేరు(paleru) నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ఈ పరిస్థితుల్లో ఖమ్మం వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్(Andra pradesh) రాష్ట్రానికి చెందిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు(ambati rambabu) కాన్వాయ్‌పై తెలంగాణకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. అంబటి రాంబాబు ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. కర్రలతో దాడికి యత్నించారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోట్లాది రూపాయల స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి జైల్లో విచారణ ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అనుకూలంగా విమర్శలు గుప్పించారు. తన కారును అడ్డుకున్న తెలంగాణ టీడీపీ నేతలతో అంబటి రాంబాబు ఎదురు దాడికి దిగారు. దీంతో పోలీసులు, ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ వారిని తరిమి కొట్టారు. కాన్వాయ్ వెళ్లిపోయినా టీడీపీ కార్యకర్తలు ఇంకా వెంబడించడం కనిపించింది. ఈ ఘటనతో ఖమ్మంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags:
Next Story
Share it