Ambati Rayudu : జనసేన పార్టీ లోకి అంబటి రాయుడు!

ఇటీవలే వైసీపీ పార్టీ కి రాజీనామా చేసిన అంబటి రాయుడు, నేడు పవన్ కళ్యాణ్ ని కాసేపటి క్రితమే భేటీ అయ్యాడు. అతి త్వరలోనే జనసేన పార్టీ లో చేరే అవకాశం.

Ambati Rayudu : జనసేన పార్టీ లోకి అంబటి రాయుడు!
X

న్యూస్ లైన్ డెస్క్: 10 రోజుల క్రితం సీఎం జగన్ సమక్షం లో వైసీపీ పార్టీలో చేరి, ఆశించిన ఎంపీ టికెట్ రాలేదని ఆ పార్టీ కి రాజీనామా చేసి బయటకి వచ్చిన అంబటి రాయుడు, ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పాడు. కానీ ఆ మాట మీద ఆయన కనీసం రెండు రోజులు కూడా నిలబడలేకపోయాడు. నేడు మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయం లో అంబటి రాయుడు కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యాడు. గుంటూరు ఎంపీ స్థానం కి జనసేన పార్టీ టికెట్ ని అంబటి రాయుడు ఆశిస్తున్నాడు అని టాక్. మరి టీడీపీ తో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ అంబటి రాయుడుకి గుంటూరు టికెట్ ఇస్తానని మాట ఇచ్చాడా?, లేకపోతే ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఏదైనా పదవి ఇస్తానని చెప్పాడా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఎంపీ టికెట్ రాకపోతే జనసేన నుండి కూడా ఆయన షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:
Next Story
Share it