Ambati Rayudu : దుబాయికి అంబటి రాయుడు పయనం..రాజకీయాలకు ఇక 'బైబై'?

దుబాయికి పయనమైన అంబటి రాయుడు మరి రాజకీయాల సంగతి ఏమిటి?

Ambati Rayudu : దుబాయికి అంబటి రాయుడు పయనం..రాజకీయాలకు ఇక బైబై?
X

న్యూస్ లైన్, అమరావతి : ప్రముఖ ఇండియన్ క్రికెటర్ అంబటి రీసెంట్ గానే వైసీపీ పార్టీ లో చేరి, పది రోజులు కూడా పూర్తి కాకముందే ఆ పార్టీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈయన ఏ పార్టీ లోకి వెళ్తాడు అని అందరూ అనుకుంటున్న సమయం లో నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కలిసి కాసేపు సుదీర్ఘ మంతనాలు జరిపాడు. ఇక జనసేన పార్టీ లో చేరిపోయాడు, గుంటూరు ఎంపీ టికెట్ కంఫర్మ్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు ఆయన ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.

ఆ పోస్ట్ లో ఏముందంటే ' నేను రాజకీయాల్లోకి స్వచ్ఛమైన మనసుతో, ప్రజలకు సేవ చెయ్యాలనే దృఢమైన సంకల్పం తో వచ్చాను. అందుకే జనాల్లో ఉన్నాను, వాళ్ళ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశాను. నేను కలలు కన్న ఆశయాలు వైసీపీ తోనే సాధ్యం అవుతాయి అనుకోని ఆ పార్టీ లో చేరాను. కానీ చేరిన కొన్ని రోజులకు నాకు అర్థం అయ్యింది. వైసీపీ భావాలు, నా భావాలు వేరు అని. అందుకే ఆ పార్టీ నుండి బయటకి వచ్చేసాను. ఆ తర్వాత నా స్నేహితులు, సన్నిహితులు పవన్ కళ్యాణ్ గారిని కలవు, నీ ఆలోచనలు, నీ భావాలు ఆయన ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి అన్నారు. వెళ్లి కలిసాను, చాలాసేపటి వరకు ఆయనతో ఎన్నో అంశాల పట్ల చర్చించాను. మా సన్నిహితులు చెప్పింది నిజమే అని అనిపించింది. ఆయన్ని కలిసినందుకు నాకు ఎంతో ఆనందం గా ఉంది. ప్రస్తుతం నేను క్రికెట్ కమిట్మెంట్స్ కోసం దుబాయి కి వెళ్తున్నాను' అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

ఇదంతా పక్కన పెడితే, ఇంతకీ అంబటి రాయుడు జనసేన పార్టీ లో చేరాడా లేదా ?, పవన్ కళ్యాణ్ ని కలిసాను, చాలా మాట్లాడాను, సంతోషం గా ఉంది అన్నాడు కానీ, ఎక్కడా కూడా ఆయన జనసేన పార్టీ లో చేరినట్టు చెప్పలేదు. అందుకు కారణం పవన్ కళ్యాణ్ గుంటూరు ఎంపీ సీట్ ఇవ్వడం కష్టం అని చెప్పాడా?, లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా?..రెండు నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు క్రికెట్ ఆడడం కోసం దుబాయి కి వెళ్ళాడు అంటే ఆయన అధికారికంగా ఈ ఎన్నికలలో పోటీ నుండి తప్పుకున్నట్టే అని అంటున్నారు నెటిజెన్స్.

Tags:
Next Story
Share it