New Delhi : టీడీపీ - జనసేనతో పొత్తు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు - అమిత్ షా

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఇప్పుడు ఢిల్లీ చుట్టూనే తిరుగుతున్నాయి. బీజేపీ తో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ, జనసేనలు ఆరాటపడుతున్నాయి. రీసెంట్ గానే చంద్ర బాబు నాయుడు అమిత్ షాని,బీజీపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ని కలిసి పొత్తుల విషయం లో చర్చలు జరిపి ఆంధ్ర కి వచ్చాడు.

New Delhi : టీడీపీ - జనసేనతో పొత్తు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు - అమిత్ షా
X

న్యూస్ లైన్, న్యూ ఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఇప్పుడు ఢిల్లీ చుట్టూనే తిరుగుతున్నాయి. బీజేపీ తో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ, జనసేనలు ఆరాటపడుతున్నాయి. రీసెంట్ గానే చంద్ర బాబు నాయుడు అమిత్ షాని,బీజీపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ని కలిసి పొత్తుల విషయం లో చర్చలు జరిపి ఆంధ్ర కి వచ్చాడు. చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చిన పక్క రోజే జగన్ వెళ్లి అమిత్ షా, నడ్డా మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని కలిసి సుదీర్ఘ చర్చలు జరిపాడు. దీంతో ఆంధ్ర రాజకీయాలు మొత్తం ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నాయి. అయితే అమిత్ షా చర్చలు జరిపిన చంద్రబాబు కి, వాళ్ల వైపు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టుగా అనిపించడం లేదు. నేడు జరిగిన ఒక సదస్సు లో అమిత్ షా పొత్తుల గురించి మాట్లాడుతూ 'ఆంధ్ర ప్రదేశ్ లో ఏ పార్టీ తో కలిసి ఎన్నికల్లోకి వెళ్ళాలి అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు, చర్చలు జరుగుతున్నాయి' అంటూ చెప్పుకొచ్చాడు. దీని అర్థం రెండు రోజులు చర్చలు జరిపినా కూడా వీళ్ళ మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదు అని అమిత్ షా మాటల్లోనే తెలుస్తుంది.

ఇక రేపో ఎల్లుండో పవన్ కళ్యాణ్ ఢిల్లీ కి పయనం కాబోతున్నాడు. అక్కడ అమిత్ షా, మోడీలతో చర్చలు జరపబోతున్నాడు. ఇదే పొత్తుల విషయంలో తుది చర్చ కూడా అవ్వొచ్చు. ఈ చర్చలు సఫలం అయితే పొత్తు ఉంటుంది, లేకపోతే పొత్తు ఉండదు అనేది లేటెస్ట్ గా వినిపిస్తున్న వాత. ఒకవేళ బీజేపీ పొత్తులోకి అడుగుపెడితే 10 నుండి 11 ఎమ్మెల్యే స్థానాలు, నాలుగు ఎంపీ స్థానాలతో పాటుగా, పవర్ షేరింగ్ కూడా ఉండాలి. వాళ్ళు చెప్పిన అభ్యర్థిని ముఖ్యమంత్రిగా కనీసం రెండేళ్లు అయిన ఉంచాలి, ఈ షరతులు ఒప్పుకుంటూనే పొత్తు ఉంటుంది అని చంద్రబాబు కి ఢిల్లీ పెద్దలు తేల్చి చెప్పడారట. మరి పవన్, చంద్రబాబు తుది నిర్ణయం ఏమిటో తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it