Ramakrishna: భావోద్వేగానికి గురైన నందమూరి రామకృష్ణ

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి రామకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంద

Ramakrishna: భావోద్వేగానికి గురైన నందమూరి రామకృష్ణ
X

న్యూస్‌లైన్, డెస్క్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి రామకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని అన్నారు. ఎప్పుడో 2021లో ఉన్న కేసును తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం చాలా అన్యాయమని, విభజన తర్వాత ఏర్పడిన ఏపీని ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అన్ని విధాలుగా మొదటి స్థానంలో నిలిపారని చెప్పారు.

చంద్రబాబు హయాంలో తొలి స్థానంలో ఉన్న ఏపీని, వైసీపీ ప్రభుత్వం అడుక్కునే స్థాయికి దిగజార్చిందని, రాష్ట్రాన్ని వదిలేసి సీఎం జగన్ విదేశాలు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి సీఎం ఉండటం మన దౌర్భాగ్యమని మండిపడ్డారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దామని, ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి మళ్లీ తొలి స్థానంలో నిలుపాలని ధీమా వ్యక్తం చేశారు. తన ప్రసంగం సందర్భంగా భావోద్వేగానికి గురైన రామకృష్ణ కంటతడి పెట్టుకున్నారు.

మరోవైపు నారా భువనేశ్వరి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఎవరైనా ఆపద వస్తే అమ్మవారి వద్దకు వస్తారుని, అందుకే తాము వచ్చామని తెలిపారు. చంద్రబాబు పోరాటం విజయవంతం అవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పుకొచ్చారు నారా భువనేశ్వరి.

Tags:
Next Story
Share it