Nellore : జనసేన పార్టీలోకి ఆనం రామనారాయణ రెడ్డి?

నెల్లూరు జిల్లాలో రాజకీయాలు రోజురోజుకి ఊహించని మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎప్పటి లాగానే ఈ ప్రాంతం లో ఈసారి కూడా వైసీపీ పార్టీ వేవ్ ఉండడం తో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తుంది. వైసీపీ పార్టీ నుండి ఎప్పుడో సస్పెండ్ కాబడ్డ వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నేడు ప్రెస్ మీట్ పెట్టి చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Nellore : జనసేన పార్టీలోకి ఆనం రామనారాయణ రెడ్డి?
X

న్యూస్ లైన్, నెల్లూరు : నెల్లూరు జిల్లాలో రాజకీయాలు రోజురోజుకి ఊహించని మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎప్పటి లాగానే ఈ ప్రాంతం లో ఈసారి కూడా వైసీపీ పార్టీ వేవ్ ఉండడం తో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తుంది. వైసీపీ పార్టీ నుండి ఎప్పుడో సస్పెండ్ కాబడ్డ వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నేడు ప్రెస్ మీట్ పెట్టి చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ 'మరో వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. నేను ఏ పార్టీలో చేరి పోటీ చేయబోతున్నాను అనేది త్వరలోనే చెప్తా. వేంకటగిరి ప్రజలు ఆశీర్వదిస్తే మరోసారి ఎమ్మెల్యే గా సేవలు అందిస్తాను. నాకు ఎమ్మెల్యే సీటు రావాలని లక్ష్మీ నరసింహ స్వామి, వేంకటగిరి పోలేరమ్మ ని కోరుకుంటున్నాను' అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట ఏమిటంటే ఆనం రామనారాయణ రెడ్డి అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షం లో జనసేన పార్టీలో చేరబోతున్నట్టుగా నెల్లూరు రాజకీయా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. పొత్తులో భాగంగా నెల్లూరు లో జనసేన పార్టీ కి రెండు సీట్లు కేటాయించాలని టీడీపీ నిర్ణయించుకుంది. సిటీ, రూరల్ లో ఇప్పటికే టీడీపీ తరుపున అభ్యర్థులు ఖరారై చాలా కాలం అయ్యింది. ఇక మిగతా స్థానాల్లో ఖాళీలు లేనందున ఆనం రామనారాయణ రెడ్డి జనసేనకు వస్తే ఆయనకీ వేంకటగిరి స్థానం అప్పగించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని టాక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుంది.

Tags:
Next Story
Share it