King Fisher Beers: ఏపీలో అడుగుపెట్టిన ‘కింగ్ ఫిషర్’.. మద్యం !

ఆంధ్రప్రదేశ్ ( AP)లోని మద్యం ప్రియులకు ఇది భలే గుడ్ న్యూస్ . దాదాపు జగనన్న వచ్చినదగ్గర నుంచి ఏపీ లో మంచి బ్రాండ్స్( LIQUOR BRANDS) ఏవీ లేవనే ఉద్దేశ్యంలో ఉన్నారు మద్యం ప్రియులు.

King Fisher Beers: ఏపీలో అడుగుపెట్టిన ‘కింగ్ ఫిషర్’.. మద్యం !
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ( AP)లోని మద్యం ప్రియులకు ఇది భలే గుడ్ న్యూస్ . దాదాపు జగనన్న వచ్చినదగ్గర నుంచి ఏపీ లో మంచి బ్రాండ్స్( LIQUOR BRANDS) ఏవీ లేవనే ఉద్దేశ్యంలో ఉన్నారు మద్యం ప్రియులు.

ప్రభుత్వం మారడంతో బ్రాండెడ్ మద్యం మళ్లీ దిగుమతి అవుతోంది. కొత్త స్టాక్‌తో మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. తాజాగా కింగ్‌ఫిషర్( KING FISHER) బీర్లు గొడౌన్లకు చేరుకున్నాయి. కింగ్ ఫిషర్ గోదాములలోకి లారీలు నుంచి బీర్లను అన్ లోడ్ చేస్తున్న వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ( ANAM VENKAT RAMANA REDDY) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.ఏపీ నుంచి మాయమైపోయిన బీర్లు మళ్లీ వచ్చాయని ఆయన దానికి క్యాప్షన్ తగిలించారు.

ఏపీ లో పేరున్న బ్రాండ్స్ విని చాలా యేళ్లయ్యిందని...తిరిగి మంచి మంచి మంచి బ్రాండ్స్ ను తిరిగి ఏపీ లో ..తీసుకురావాలని కోరుతున్నారట యూత్. దీనికి స్పందించిన ఆనం.. త్వరలోనే అన్ని మద్యం బ్రాండ్లు దొరుకుతాయని పేర్కొన్నారు. మరోవైపు, ఇష్టమైన మద్యం మళ్లీ అందుబాటులోకి వస్తుండడంతో నెటిజన్లు మీమ్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

`


Tags:
Next Story
Share it