Ananthapuram: రాయదుర్గం ఎస్బిఐ సీనియర్ మేనేజర్ అరెస్ట్

Ananthapuram: తెలంగాణం, (ఆగస్ట్ - 25) : అనంతపురం జిల్లా రాయదుర్గంలోని స్టేట్ బ్యాంక్

Ananthapuram: రాయదుర్గం ఎస్బిఐ సీనియర్ మేనేజర్ అరెస్ట్
X

Ananthapuram: తెలంగాణం, (ఆగస్ట్ - 25) : అనంతపురం జిల్లా రాయదుర్గంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మెయిన్ బ్రాంచ్ లో నిధుల గోల్మాల్ జరిగింది. పట్టణంలోని కనేకల్ రోడ్డులో గల భారతీయ స్టేట్ బ్యాంక్ కార్యాలయంలో ఒకకోటి ఏడు లక్షల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగింది.

ఇంతకుముందు బ్యాంకులో మేనేజర్ గా పనిచేసిన ఎస్ఎల్ఎన్ ఫణికుమార్ బ్యాంకు ఖాతాదారులకు చెందిన 1,07,30,023 రూపాయల సొమ్ము తన తల్లి, ఇతరుల ఖాతాకు బదిలీ చేసి నిధుల దుర్వినియోగం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గమనించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ రీజినల్ మేనేజర్ వెంకటేశ్వరరావు శాఖపరమైన విచారణ చేపట్టి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జూన్ నెల 21న అప్పటి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఫణి కుమార్ పై ఫిర్యాదు చేశారు.

అప్పటినుండి ఫణి కుమార్ పరారీ లో ఉన్నాడు. దీంతో ఫణి కుమార్ ని అరెస్ట్ చేయడానికి పోలీస్ శాఖ రెండు బృందాలను ఏర్పాటు చేయగా.. రెండు నెలలుగా ఫణి కుమార్ వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఉంటూ తప్పించుకుని తిరిగాడు. ఎట్టకేలకు రాయదుర్గం సీఐ ఆధ్వర్యంలో పోలీసులు వైజాగ్ లో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఖాతాదారుల సొమ్మును రికవరీ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Tags:
Next Story
Share it