Prakasam district: పొలంలో ధగధగా మెరుస్తూ కనిపించిన పురాతన కాలపు రాయి!

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బాపనపల్లి అనే ప్రాంతం లోని ఒక పొలం లో ధగధగా మెరుస్తూ ఒక కాంతివంతమైన రాయి ఒకటి బయటపడింది. 8 వ శతాబ్దానికి చెందిన ఈ రాయిపై తెలుగు లిపి లో ఎదో లిఖించినట్టుగా కనిపించింది.

Prakasam district: పొలంలో ధగధగా మెరుస్తూ కనిపించిన పురాతన కాలపు రాయి!
X

న్యూస్ లైన్ , ప్రకాశం జిల్లా : శాసనాలు మన మహోన్నత చరిత్రకి ఆధారాలు..మన పురాణాళ్ళను నమ్మని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన చరిత్రని అవహేళన చేసేవాళ్ళు , మూఢనమ్మకాలు అంటూ వెక్కిరించే మేధావులు చాలా మంది ఉన్నారు. కానీ పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు కూడా మన చరిత్ర, మన నాగరికత, చిన్నప్పటి నుండి వింటూ చూస్తూ పెరిగినవి నిజమేనని నిరూపించాయి. ఆరోజుల్లో రాసిన శాసనాలు ఎదో ఒక సందర్భం లో బయటపడినప్పుడు పరిశోధించి నిర్ధారించిన నిజాలు అవి. అలాంటి చరిత్రకి సంబంధించిన ఆధారాలు మన ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికీ అక్కడక్కడా తెలుగు లిపి లో బయటపడుతున్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు రీసెంట్ గా ప్రకాశం జిల్లా బాపనపల్లి లో బయటపడింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బాపనపల్లి అనే ప్రాంతం లోని ఒక పొలం లో ధగధగా మెరుస్తూ ఒక కాంతివంతమైన రాయి ఒకటి బయటపడింది. 8 వ శతాబ్దానికి చెందిన ఈ రాయిపై తెలుగు లిపి లో ఎదో లిఖించినట్టుగా కనిపించింది. వాటిని చూసి గ్రామస్తులు ఆకాలం లో రాజులు ఎదో గుప్త నిధికి సంబంధించిన వివరాలు రాసారేమో అని అనుకున్నారు. అయితే ఈ రాయి గురించి స్థానికంగా ఉన్న తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్‌కు సమాచారం అందించారు గ్రామస్తులు. ఈ రాయిని క్షుణ్ణంగా పరిశీలించిన శ్రీనివాసప్రసాద్ ఆ రాయికి ఫోటోలను తీసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కె. మునిరత్నంకు పంపించారు. దీనిని పరిశీలించిన మునిరత్నం ఇది రాయిపై ఆరోజల్లో మకరద్వజ అను బిరుదును కలిగిన శ్రీ త్రిపురాంతకుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు రాయించిన శాసనంగా చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ శాసనం లో ఏమని రాసి ఉందంటే కైలాస భగవంతుడిగా కొలిచే శ్రీ ఉమరవెయిధీశ్వర దేవుడికి దండియమ్మ అను ఆమె ” పన్నాస ” అనే భూమి, ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లు ఈ శాసనంలో రాసి ఉంది అట. ఈ రాయికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Tags:
Next Story
Share it