Rail Accident : విజయనగరం రైలు ప్రమాదం.. 14కు చేరిన మృతుల సంఖ్య

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం (Rail Accident) చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగిపోవడంతో

Rail Accident : విజయనగరం రైలు ప్రమాదం.. 14కు చేరిన మృతుల సంఖ్య
X

Rail Accident : విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం (Rail Accident) చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగిపోవడంతో విశాఖ - రాయగడ ప్యాసింజర్‌ రైలు నిలిచినపోయింది. ఈ తరుణంలోనే...పట్టాలపై ఉన్న ప్యాసింజర్‌ రైలును ఢీకొట్టింది పలాస ఎక్స్‌ప్రెస్ (palasan express). దీంతో మూడు ప్యాసింజర్‌ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటనలో ఏకంగా 100 మంది గాయపడ్డారు.

అలాగే... కంటాకపల్లి (kantapalli) రైలు ప్రమాదంలో (Rail Accident) మృతుల సంఖ్య 14కు చేరింది. సహాయక కార్యక్రమాలు పూర్తయితే ఇది 40 వరకు చేరే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు పది మృతదేహాలను వెలికితీయగా... భోగిల మధ్య నలిగిపోయిన మృతదేహాలను ఇంకా తీయాల్సి ఉందని తెలుస్తోంది. సమీపంలో దారే లేకపోవడంతో క్షతగాత్రుల్ని కిలోమీటర్ మేర పట్టాలపై తీసుకెళ్లి అక్కడి నుంచి ఆంబులెన్స్ లోకి ఎక్కించారు.

Tags:
Next Story
Share it