AP: విశాఖ అమ్మాయికి " నంది ప్రతిభా పురస్కార్ అవార్డు"

గీతం కాలేజీ విద్యార్ధిని పోలిశెట్టి చంద్రమానస( polishetty chandra mansa) కు కీర్తి ఆర్ట్ అండ్ అసోసియేషన్ వారు ఈ నంది ప్రతిభా పురస్కార్ అవార్డును ఇచ్చారు.

AP: విశాఖ అమ్మాయికి  నంది  ప్రతిభా పురస్కార్ అవార్డు
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గీతం కాలేజీ విద్యార్ధిని పోలిశెట్టి చంద్రమానస( polishetty chandra mansa) కు కీర్తి ఆర్ట్ అండ్ అసోసియేషన్ వారు ఈ నంది ప్రతిభా పురస్కార్ అవార్డును ఇచ్చారు. చంద్రమానస ప్రస్తుతం గీతం కాలేజీ లో ఆర్కిటెక్చర్ సంబంధించిన డిగ్రీ నాలుగో సంవత్సరం చదువుతుంది. ఫోమ్ బోర్డ్ తో సింహాచలం టెంపుల్ ఆర్కిటెక్ట్ ను అధ్భుతంగా తయారుచేశారు చంద్రమానస. దీనికి గాను మానసకు నందిప్రతిభా పురస్కార్ అవార్డు దక్కింది. అయితే చిన్నతనం నుంచే మానసకు ఆ క్లే వర్క్స్, కార్డ్ బోర్డ్ వర్క్స్, క్రాఫ్ట్ ఐటమ్స్ పై ఎక్కువ ఇంట్రస్ట్ . స్కూల్ స్టేజ్ నుంచే ఈ చిన్న చిన్న ఐటమ్స్ తయారు చేయడం , స్కూల్ ప్రాజెక్ట్స్ చేయడంపై మక్కువ చూపించేదంటున్నారు చంద్రమానస తల్లి లక్ష్మీ శ్యామల, తండ్రి పోలి శెట్టి సుబ్బారావు . ఫ్యూఛర్ లో యాదాద్రి టెంపుల్ ఆర్కిటెక్చర్ ను ఫోమ్ బోర్డ్ తో తయారుచేయడం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అని అంటుంది మానస.










Tags:
Next Story
Share it