Siddham : లోకేష్ ఒక అబ్బకి అమ్మకి పుట్టుంటే ఇక్కడకి రావాలి - అనిల్ కుమార్ యాదవ్

సీఎం జగన్ నేడు అడ్డంకి లో నిర్వహించిన నాల్గవ సిద్ధం సభకు రాష్ట్రము నలుమూలల నుండి లక్షలాది మంది జనాలు హాజరయ్యారు. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చినప్పటికీ కూడా టీడీపీ, జనసేన కి సంబంధించిన అభిమానులు 'సిద్ధం' సభ అట్టర్ ఫ్లాప్ అని, సభ మొత్తం గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్స్ చేస్తున్నారని, ఇలా పలు రకాల వ్యాఖ్యలు చేసారు.

Siddham : లోకేష్ ఒక అబ్బకి అమ్మకి పుట్టుంటే ఇక్కడకి రావాలి - అనిల్ కుమార్ యాదవ్
X

న్యూస్ లైన్, అద్దంకి : సీఎం జగన్ నేడు అడ్డంకి లో నిర్వహించిన నాల్గవ సిద్ధం సభకు రాష్ట్రము నలుమూలల నుండి లక్షలాది మంది జనాలు హాజరయ్యారు. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చినప్పటికీ కూడా టీడీపీ, జనసేన కి సంబంధించిన అభిమానులు 'సిద్ధం' సభ అట్టర్ ఫ్లాప్ అని, సభ మొత్తం గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్స్ చేస్తున్నారని, ఇలా పలు రకాల వ్యాఖ్యలు చేసారు. అయితే దీనికి ప్రస్తుత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, నరసాపురం ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఎందుకంటే సిద్ధం సభ జరుగుతున్న ప్రాంతం లో తెలుగు దేశం పార్టీ వారు ధ్రోన్ కెమెరాలను గాల్లోకి ఎగరవేసి, దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి జనాలు రాలేదు అంటూ పోస్టులు పెట్టారు. దీనికి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ 'ఇంట్లో ఒక మూలాన కూర్చొని, మా సభల్లో ధ్రోన్ కెమెరాలను ఎగురవేసి, ఖాళీ ప్రదేశాల్లో ఫోటోలు తీసి జనాలు రావట్లేదు అని ప్రచారం చెయ్యడం కాదు లోకేష్, దమ్ముంటే, ఒక అమ్మా అబ్బకి పుట్టినవాడివే అయితే ఇక్కడికిరా, బిడ్డా ఎక్కి తొక్కుతాం. మా వాళ్ళ శబ్దానికే గుండెలు ఆగి చస్తావ్' అంటూ ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Tags:
Next Story
Share it