Tirumala : తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత

తిరుమల శ్రీవారి సన్నిధిలో చిరుతల సంచారం భక్తులకు కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఓ చిరుత దాడిలో

Tirumala : తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత
X

Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో చిరుతల సంచారం భక్తులకు కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఓ చిరుత దాడిలో నెల్లూరుకు చెందిన చిన్నారి లక్ష్మిత మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తిరుమల నడక మార్గంలో మరో చిరుత కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే..ఆ చిరుత బోనులో చిక్కింది. గత మూడు రోజులు క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమీపంలోనే బోనులో ఈ చిరుత చిక్కింది. చిరుతను బంధించడానికి మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు.

మోకాలి మిట్ట,లక్ష్మి నర సింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే.. ఈ తరుణంలోనే లక్ష్మి నరసింహస్వామి ఆలయం వద్దే బోనులో చిక్కింది ఆ చిరుత. దీంతో 50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను బంధించారు అటవీ అధికారులు. జింకలు నడక మార్గంలో ఎక్కువగా తిరగడం వల్లే.. చిరుతలు ఇటు వైపుగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

Tags:
Next Story
Share it