AP : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు (assembly) ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున

AP : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..!
X

AP : ఏపీ (AP) అసెంబ్లీ ( assembly) సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు (assembly) ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ముగిశాక.... శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ అయి సమావేశాల ఎజెండాను ఖరారు చేయనుంది.

సభను మూడు రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మరికొన్ని రోజులు సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్ష టీడీపీ (tdp) కోరితే.....మరో రెండు రోజులపాటు సభ నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 6 వ తేదీ మంగళవారం కావడంతో 7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (buggana) శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత 15వ శాసనసభకు ఇవి 12వ, చివరి సమావేశాలు కావడం గమనార్హం.

Tags:
Next Story
Share it