Ap Budget 2024: నేడే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న బుగ్గన

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను (Ap Budget 2024) ఇవాళ ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్‌. ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే

Ap Budget 2024: నేడే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న బుగ్గన
X

Ap Budget 2024: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను (Ap Budget 2024) ఇవాళ ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్‌. ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది జగన్‌ ప్రభుత్వం. ఇక ఇవాళ ఉదయం 11.03 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ (Buggana Rajendranath).

మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ (Buggana Rajendranath). ఇక సభలో ఇవాళ మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆర్జేయూకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024.. ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 బిల్లులను ప్రవేశ పెట్టనుంది ఏపీ సర్కార్‌.

Tags:
Next Story
Share it