APSRTC : ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్

ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్ అయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏపీ ఆర్టీసి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. టీడీపీ శ్రేణులు చేపట్టే ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో బస్సులను డిపోలకే పరిమితం చేశారు. ఇందులో భాగంగానే...ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్ అయ్యాయి.

APSRTC : ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్
X

APSRTC : ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్ అయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏపీ ఆర్టీసి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. టీడీపీ శ్రేణులు చేపట్టే ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో బస్సులను డిపోలకే పరిమితం చేశారు. ఇందులో భాగంగానే...ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్ అయ్యాయి.

ఇక చంద్రబాబు అరెస్టుపై బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ట్వీట్ చేశారు. సరైన నోటీసు ఇవ్వకుండా ఎఫ్ఐఆరులో పేరు పెట్టకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని.. ఎక్సప్లనేషన్ తీసుకోలేదు.. ప్రొసీజర్ ఫాలో కాకుండా జరిగిన చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని స్పష్టం చేశారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. ఈ తరహాలో అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదని.. బీజేపీ దీన్ని ఖండిస్తుందని వెల్లడించారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.

ఇక అటు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఏదైనా ఉంటే పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టవచ్చు....కాని పోలీసులు అర్ధరాత్రి వెళ్లి హంగామా సృష్టించాల్సిన అవసరమేమొచ్చింది? అని నిలదీశారు. లోకేష్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలను నిర్బంధించటం దుర్మార్గమని... మార్గదర్శిపై సిఐడి దుందుడుకుగా వ్యవహరిస్తోందని తెలిపారు.

Tags:
Next Story
Share it