AP CID: సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెట్టే 2,972 మందిపై కేసు

సోషల్ మీడియా(social media)లో పోస్టులు పెట్టే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఏపీ సీఐడీ(ap cid) హెచ్చరించింది.

AP CID: సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెట్టే  2,972 మందిపై కేసు
X

AP CID: సోషల్ మీడియా(social media)లో పోస్టులు పెట్టే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఏపీ సీఐడీ(ap cid) హెచ్చరించింది. ఏపీ సీఎం జగన్(ap cm jagan), ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్ సంజయ్(cid cheif sanjay) హెచ్చరించారు. అలా పోస్టులు పెట్టిన వారి ఆస్తులను అటాచ్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. బుధవారం ఆయన మీడియా(media) సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై త్వరలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా ఖాతాలను గుర్తించామని, త్వరలోనే నిందితుల ఆస్తులను అటాచ్(attach) చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతల పోస్టులపై కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటామన్నారు. వాటిలో కొన్ని పోస్ట్‌(post)లు ఇప్పటికే తీసివేయబడ్డాయని.. న్యాయ వ్యవస్థను అవమానించేలా పోస్టులు షేర్ చేసిన వారిని శిక్షించాలని తెలిపారు. సీఎం జగన్‌, తన కుటుంబసభ్యులకు వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టిన వారిలో టీడీపీ నేత కార్తీక్‌రెడ్డి, సమరసింహారెడ్డి, చిట్లహరి, వైసీపీ తదితరులకు చెందిన ఖాతాలు ఉన్నాయని ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ ప్రకటించారు. ఇతర దేశాల నుంచి వచ్చే పోస్టుల విషయంలో ఆయా ఎంబసీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. 202 ఖాతాలపై దృష్టి సారించామని, అసభ్యకరమైన పోస్ట్‌లను షేర్(share)చేసి లైక్ చేస్తున్న 2,972 మందిపై సైబర్ బెదిరింపు షీట్లు తెరిచామని సంజయ్ వెల్లడించారు.

Tags:
Next Story
Share it