AP CID : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడు

చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడు. ఈ కేసులో 550 కోట్ల స్కాం జరిగింది అందుకే చంద్రబాబుని అరెస్ట్ చేసామని వెల్లడించారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. ఇవాళ ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేశామని... ఈ స్కాం లో ప్రధాన నిందితుడు చంద

AP CID : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడు
X

AP CID : చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడు. ఈ కేసులో 550 కోట్ల స్కాం జరిగింది అందుకే చంద్రబాబుని అరెస్ట్ చేసామని వెల్లడించారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. ఇవాళ ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేశామని... ఈ స్కాం లో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. స్కిల్ స్కాంలో కీలక సూత్రధారి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని.. విచారణలో మరిన్ని విషయాలు బయటకు రావాలంటే చంద్రబాబు కస్టడీ చాలా అవసరం అని తెలిపారు.

చంద్రబాబు పాత్ర ఉందన్నది స్పష్టమని.. ఈడీ, జీఎస్టీ సంస్థలు కూడా విచారణ చేస్తున్నాయని వెల్లడించారు. తగిన ఆధారాలను కోర్టు ముందు పెడతామని... ఈ స్కాం లో లబ్దిదారుడు చంద్రబాబు అని స్పష్టం చేశారు. డిజైన్ టెక్ నుంచి అనేక షెల్ కంపెనీలకు నిధులు వెళ్ళాయని.. కుంభకోణం చేయాలనే ఉద్దేశంతోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. 2014 లో జులై నాటికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని.. ఏర్పాటు కంటే ముందే డిజైన్ టెక్ తో ఒప్పందం కుదిరిందని తెలిపారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారని వెల్లడించారు ఏపీ సీఐడీ సంజయ్.

Tags:
Next Story
Share it