Jagan: గద్దర్ మృతిపై ఏపీ సీఎం దిగ్భ్రాంతి

ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసం విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం అధికారికంగా వెల్లడించారు. గద్దర్ మృతిపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Jagan: గద్దర్ మృతిపై ఏపీ సీఎం దిగ్భ్రాంతి
X

న్యూస్‌లైన్, డెస్క్: ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసం విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం అధికారికంగా వెల్లడించారు. గద్దర్ మృతిపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బడుగు, బలహీన వర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అన్నారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని గుర్తు చేశారు. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసం బతికారని, ఆయన లేరన్న వార్త ఊహించలేదన్నారు. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించి ఉంటాయన్నారు. గద్దర్‌కి తెలుగు జాతి సెల్యూట్ చేస్తుందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో గద్దర్ అంటే తెలియని వారుండరు. దశాబ్దాల పాటు విప్లవ రాజకీయాల్లో తన ఆట పాటలతో తెలంగాణ ప్రజలను ఉర్రూతలు ఊగించి ఎంతో మంది యువతను విప్లవ రాజకీయాలు, విప్లవ పార్టీల వైపు ఆకర్షించారు.

Tags:
Next Story
Share it