Ys Jagan: నోరు జారిన ఏపీ సీఎం జగన్.. పొటాటో అంటే ఉల్లిగడ్డట

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పొరపాటున నోరు జారారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉల్లి గడ్డను పొటాటో అంటారు కదా అన్నారు.

Ys Jagan: నోరు జారిన ఏపీ సీఎం జగన్.. పొటాటో అంటే ఉల్లిగడ్డట
X

Ys Jagan: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పొరపాటున నోరు జారారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉల్లి గడ్డను పొటాటో అంటారు కదా అన్నారు. దీంతో అక్కడున్న వారంతా పక్కున నవ్వుకున్నారు. బంగాళదుంప అని అనగా.. బంగారుదుంప అని సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడ మరోసారి అందరూ నవ్వుకున్నారు. ఇటీవల తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. శుక్రవారం వాకాడు మండలం బాలిరెడ్డిపల్లెలో వరద బాధితులతో ఆయన మాట్లాడారు. ప్రభావిత ప్రాంతాల్లో 92 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 8 వేల మందికి పైగా బాధితులను అక్కడికి తరలించినట్లు తెలిపారు. 60 వేల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. 25 కిలోల బియ్య, కందిపప్పు, పామాయిల్, కిలో ఆనియన్, బంగాళాదుంపలు ఇస్తున్నామని తెలిపారు. ఆ క్రమంలోనే పొటాటోను ఉల్లిగడ్డ అన్నారు. కాదు.. కాదు అనగా పొటాటో అంటే బంగాళదుంప.. బంగారు దుంప అన్నారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వేశారు.


Tags:
Next Story
Share it