AP : సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుకున్న బాలిక

గుంటూరు జిల్లాకి చెందిన ఉలవ సురేష్ తాను సహజీవనం చేస్తున్న పుప్పాల సుహాసిని (36)ని ఆమె కుమార్తెలు

AP : సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుకున్న బాలిక
X

AP : గుంటూరు జిల్లాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పెంపుడు తండ్రి గోదావరిలోకి నెట్టినా తన ప్రాణాలు కాపాడుకుంది కీర్తన అనే అమ్మాయి. ఈ సంఘటన నిన్న గుంటూరు జిల్లాలో చోటు చేసుకోగా..ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాకి చెందిన ఉలవ సురేష్ తాను సహజీవనం చేస్తున్న పుప్పాల సుహాసిని (36)ని ఆమె కుమార్తెలు కీర్తన (13), జెర్సీ (1) లను వదిలించుకోవాలని ఆదివారం ఉదయం నాలుగు గంటలకు గోదావరిలోకి నెట్టి వేశాడు.

ఈ దుర్ఘటనలో సుహాసిని, జెర్సీ గల్లంతయ్యారు. 13 ఏళ్ల కీర్తన మాత్రం బ్రిడ్జి పక్కన వేసిన కేబుల్ పైప్ ఒక చేత్తో పట్టుకుని వేలాడి ప్రాణాలు కాపాడుకుంది. అదే సమయంలో తన జేబులో ఫోన్ ఉన్న విషయం గుర్తొచ్చి 100కు డయల్ చేయగా పోలీసులు వచ్చి కీర్తన ప్రాణాలు కాపాడారు. అర గంట పాటు పైపుకి వేలాడి ప్రాణాలు కాపాడుకొని.. తమకు ఫోన్ చేసిన కీర్తన సమయస్పూర్తికి, ధైర్యాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు.

Tags:
Next Story
Share it