CM Jagan: ఏపీ సీఎం జగన్‌.. సహా 41 మందికి హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andhra Pradesh High Court) సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేసింది.

CM Jagan: ఏపీ సీఎం జగన్‌.. సహా 41 మందికి హైకోర్టు నోటీసులు
X

CM Jagan: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andhra Pradesh High Court) సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం(YCP Govt)లో అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు(Andhra Pradesh High Court)లో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని ఆయన అన్నారు. రఘురామ కృష్ణంరాజు(raghu rama krishnam raju) తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు మాట్లాడుతూ.. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు.

దీంతో ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. దీంతో సీఎం జగన్(CM Jagan) సహా 41 మందిని ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. కాగా, సీఎం జగన్ బెయిల్ రద్దుపై రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టు(supreme court)లో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ జరగనుంది. జగన్ అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నందున దర్యాప్తును వేగవంతం చేయాలంటూ రఘురామ చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు(telangana high court) కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను రఘురామ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించనుంది.

Tags:
Next Story
Share it