AP passengers : రైలు ప్రమాదంలో ఏపీ వాళ్లు ఎంత మంది ఉన్నారంటే...!

ఒడిశా రైలు ప్రమాదం నుంచి 267మంది సేఫ్ గా ఉన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) తెలిపారు. ప్రస్తుతం 113 మంది ఫోన్ లో అందుబాటులో లేరని తెలిపారు. వీరి కోసం గాలిస్తునట్లు తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.

AP passengers : రైలు ప్రమాదంలో ఏపీ వాళ్లు ఎంత మంది ఉన్నారంటే...!
X

న్యూస్ లైన్, డెస్క్: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి (Andhra Pradesh) చెందిన ప్రయాణికులు చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 482 మంది ఏపీకి చెందినవాళ్లు టికెట్ రిజర్వేషన్లు చేసుకున్నట్లుగా నిర్ధారించారు. వీరిలో 82 మంది టికెట్లు రద్దు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికుల్లో విశాఖపట్నంలో 309 మంది, రాజమండ్రిలో 31మంది, ఏలూరులో 5, విజయవాడలో 137మంది దిగాల్సి ఉన్నట్లు తెలిపారు. ప్రమాదం నుంచి 267మంది సేఫ్ గా ఉన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) తెలిపారు. ప్రస్తుతం 113 మంది ఫోన్ లో అందుబాటులో లేరని తెలిపారు. వీరి కోసం గాలిస్తునట్లు తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.

అటూ యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో తెలుగువాళ్లు 89మంది ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. వీరిలో 10మంది ప్రయాణం రద్దు చేసుకున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. వీరిలో 28మంది ఫోన్లు కలవడం లేదని వీరి కోసం కూడా గాలిస్తున్నట్లు తెలిపారు. బాధితులు గాయపడి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారో త్వరలోనే గుర్తిస్తామన్నారు. ఎవరైనా కుటుంబ సభ్యులు ఈ రైళ్లలో ప్రయాణిస్తే హెల్ప్ లైన్ సెంటర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు మంత్రి బొత్స .

Tags:
Next Story
Share it