Ap politics: రాబోవు ఎన్నికల్లో ఆ పార్టీదే గెలుపు.. లేటెస్ట్ సర్వే ఏం చెబుతుందంటే..?

తెలంగాణలో ఎన్నికలు ముగిస్తాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి

Ap politics: రాబోవు ఎన్నికల్లో ఆ పార్టీదే గెలుపు.. లేటెస్ట్ సర్వే ఏం చెబుతుందంటే..?
X

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలో(telangana) ఎన్నికలు ముగిస్తాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి కానీ మరో తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇంకో కొన్ని నెలల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదే తరుణంలో ఏపీలో కీలక పార్టీలు అయినటువంటి తెలుగుదేశం మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఎక్కువగా పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.

అంతేకాకుండా ఈసారి జనసేన(janasena) పార్టీ కూడా ఎక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం కనిపించడంతో అక్కడి రాజకీయం చాలా ఆసక్తికరంగా మారనుంది. ఇదే తరుణంలో యువగలం పేరుతో నారా లోకేష్(lokesh) రాష్ట్ర మంతా చుట్టి కాస్త తెలుగుదేశం పార్టీలో జోష్ పెంచారు. అంతేకాకుండా అధికార వైయస్సార్సీపీ(ysrcp) మాత్రం ప్రతి పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి ఆ పథకాలు పేరు చెప్పుకొని మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సర్వే సంస్థలు సర్వేలు చేస్తూ ఏ పార్టీ గెలుస్తుందో తెలియజేస్తున్నాయి.

కొన్ని సంస్థలు తెలుగుదేశం(tdp) పార్టీ గెలుస్తుంది అని చెబితే మరికొన్ని సంస్థలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంటున్నారు. మరి తాజాగా ఫోల్ స్టటజీ ఈ గ్రూప్ ఆంధ్ర ప్రదేశ్ లోని(ap) రాజకీయాల పైన ఒక సర్వేను నిర్వహించింది. వీరి సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. వీరి సర్వే రిపోర్ట్ ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysrcp)మళ్లీ అధికారంలోకి వస్తుందని అది 56% ఓట్లతో గద్దెనెక్కుతుందని తెలియజేస్తోంది. అంతేకాకుండా టిడిపి కూడా 44% శాతం ఓట్లు వస్తాయని, అంటే టిడిపికి జనసేనతో పొత్తు ఉంటే మాత్రమే ఈమెరకు వస్తుందని, లేదంటే 37 శాతానికి పడిపోతుందని తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఫోల్ స్టాటజీ సర్వే ఈ విధంగా చెప్పడంతో ఈ సర్వే కాస్త వైరల్ గా మారింది.

Tags:
Next Story
Share it