Current Charges : ఏపీలో పెరిగిన కరెంటు బిల్లులకు కారణం చంద్రబాబే!

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కరెంటు చార్జీలు ఏ రేంజ్ లో పెరిగాయో మన అందరికీ తెలిసిందే. దీనికి వైసీపీ పార్టీ ని జనాలు తిట్టుకుంటున్నారు, కానీ ఇలా కరెంటు బిల్లులు పెరగడానికి కారణం ఆంధ్ర ప్రదేశ్ గత సీఎం చంద్రబాబు నాయుడు అని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.

Current Charges : ఏపీలో పెరిగిన కరెంటు బిల్లులకు కారణం చంద్రబాబే!
X

Newsline, Amaravati: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ పార్టీ పై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతకు ప్రధాన కారణాలలో ఒకటి పెరిగిన కరెంటు బిల్లులు. ఒకప్పుడు 500 కూడా రాని కరెంటు బిల్లు, ఇప్పుడు ఏకంగా 1500 రేంజ్ లో వస్తుంది. ఇలా ఉంటే అసలు సామాన్యులు ఎలా బ్రతకాలి అని ప్రజలు విలపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీనిని ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ మరియు జనసేన వైసీపీ ని తీవ్రంగా దెబ్బతియ్యడానికి వాడుకున్నాయి. ప్రభుత్వం పెన్షన్లు ఇస్తున్నట్టే ఇచ్చి కరెంటు బిల్లుల రూపం లో తిరిగి తీసేసుకుంటున్నాయని, ప్రజలు ఇది గమనించాలి అంటూ ఎద్దేవా చేసారు. కానీ కరెంటు చార్జీలు ఈ స్థాయిలో పెరగడానికి కారణం చంద్రబాబు నాయుడే అని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పుకొస్తున్నారు. ఆయన చేసిన అప్పుల భారమే నేడు జనాల మీద పడుతుందని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు హయాం లో విద్యుత్ శాఖ మీద 25 వేల కోట్ల రూపాయిలు అప్పు చేసి వెళ్లాడని, అది వడ్డీలు పెరుగుతూ పోయిందని, అదే సమయం లో ఆంధ్ర రాష్ట్రం కరోనా మహమ్మారి విజృంభించడం, ఆ తర్వాత ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం అప్పులు బాగా చెయ్యడం కారణంగా విద్యుత్ శాఖ పై భారం పెరిగిందని. వేరే మార్గం లేక ఇప్పుడు యూనిట్ ధరలు పెంచి అప్పులు పూడ్చాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు అధికారం లోకి వచ్చిన తర్వాత కూడా విధ్యుత్ చార్జీలు అప్పు పూడేంత వరకు ఇలాగే కొనసాగుతుందని అంటున్నారు. మరి చంద్రబాబు దీనికి మ్యానిఫెస్టో ఏమని చెప్తాడో చూడాలి.

Tags:
Next Story
Share it