Ap Roads: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఏపీలో రోడ్లే లేవుగా !

AP Roads: ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Ap Roads: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఏపీలో రోడ్లే లేవుగా !
X

AP Roads: ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో ప్రధాన రహదారులు మొదలుకొని అన్ని రకాల రోడ్లు కూడా అత్యంత దారుణంగా ఉన్నాయంటూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతూనే ఉంటాయి. గతుకులు, కంకర తేలిపోవడం, వర్షాలకు తెగిపోవడం, భారీ గుంతలు అన్నీ ఆంధ్రప్రదేశ్ రోడ్లపై కనిపించేవి. అస్తవ్యస్తమైన రహదారులతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణం చేయాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, పాలకులు మారినా ఏపీలో 36 గ్రామాలు రోడ్డు మార్గం లేని దుస్థితిలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచిగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో బుర్రిగూడ గ్రామం నుండి గడ్డగూడ గ్రామం వెళ్లాలంటే వాగు దాటాల్సిందే.

ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ మండల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్లు, బ్రిడ్జిలు లేని గ్రామాలు చాలానే ఉన్నాయి. తాజాగా లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఇద్దరు యువకులు వాగు దాటేందుకు వారి బైక్ ని భుజాలపై ఎత్తుకొని వెళ్లారు. వర్షానికి వాగు పొంగిపొర్లడంతో అటుగా వెళ్లాల్సిన గ్రామ గిరిజన గ్రామస్తులు వాగు దాటేందుకు బైకును భుజాలపై ఎత్తుకొని వెళుతుండగా వీరికి ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఏదైనా జరగరానిది జరిగితే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి తమకు బ్రిడ్జి మార్గం ఏర్పాటు చేయాలని 36 గిరిజన గ్రామాలు కోరుతున్నాయి.

Tags:
Next Story
Share it