Janasena: ఎన్నికల తర్వాత జనసేన ఊపిరి ఆగిపోవడం ఖాయం !

ఎన్నికల తర్వాత జనసేన ఊపిరి ఆగిపోవడం ఖాయమంటున్నారు ఏలూరు జనసేన ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు. ఇవాళ మీడియాతో అప్పలనాయుడు మాట్లాడుతూ... ఆసక్తికర వ్యాఖ్యలు

Janasena: ఎన్నికల తర్వాత జనసేన ఊపిరి ఆగిపోవడం ఖాయం !
X

Janasena: ఎన్నికల తర్వాత జనసేన ఊపిరి ఆగిపోవడం ఖాయమంటున్నారు ఏలూరు జనసేన ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు. ఇవాళ మీడియాతో అప్పలనాయుడు మాట్లాడుతూ... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ తరఫున పోటీ చేయబోయే 24 మందిలో ఎంతమంది గెలుస్తారో తెలియదు..అయినా... గెలిచినవారు పార్టీలో ఉంటారో లేదో అనుమానమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో జనసేనకు ఊపిరి ఉంటుందా లేదా అనే విషయాన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామని వెల్లడించారు.

అధికారంలో షేర్ లేకుండా తక్కువ సీట్లు తీసుకోవడం వల్ల జనసేన ఓట్లు ట్రాన్స్‌ ఫర్‌ అయ్యే అవకాశం కనిపించట్లేదని తెలిపారు. పవన్ ప్రకటించిన దానికి భిన్నంగా సీట్ల కేటాయింపు జరిగిందని ఫైర్‌ అయ్యారు. ఎక్కువ సీట్లు తీసుకోకపోవడం పార్టీ అభివృద్ధికి ఆటంకమన్నారు. తాడేపల్లిగూడెం సభకు వెళ్లాలా లేదా అనేది కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు అప్పలనాయుడు. ఏలూరు అసెంబ్లీ సీటు దక్కకపోవడం అసంతృప్తికి గురిచేసిందని.... ఏలూరులో జనసేన కచ్చితంగా గెలిచేదన్నారు అప్పలనాయుడు.

Tags:
Next Story
Share it