NIA: మావోయిస్టు ఆర్కే భార్య అరెస్టుపై ఏన్‌ఐఏ కీలక ప్రకటన!

మావోయిస్టు అగ్రనేత, దివంగత ఆర్కే భార్య శిరీష అరెస్టు ఎన్‌ఐఏ కీలక ప్రకటన చేసింది. ఆర్కే డైరీ ఆధారంగానే దొడ్డు ప్రభాకర్‌తో పాటు శిరీషపై కేసు నమోదు చేశాయని అధికారులు తెలిపారు. ఆర్కే సతీమణి శిరీషను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

NIA: మావోయిస్టు ఆర్కే భార్య అరెస్టుపై ఏన్‌ఐఏ కీలక ప్రకటన!
X

న్యూస్‌లైన్, డెస్క్: మావోయిస్టు అగ్రనేత, దివంగత ఆర్కే భార్య శిరీష అరెస్టుపై ఎన్‌ఐఏ కీలక ప్రకటన చేసింది. ఆర్కే డైరీ ఆధారంగానే దొడ్డు ప్రభాకర్‌తో పాటు శిరీషపై కేసు నమోదు చేశాయని అధికారులు తెలిపారు. ఆర్కే సతీమణి శిరీషను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో శిరీష తన నివాసంలో ఉండగా ఎన్ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

మావోయిస్ట్‌లతో దొడ్డు ప్రభాకర్‌, శిరీషకు డైరెక్ట్ సంబంధాలున్నాయని తెలియజేశారు. మావోయిస్టుల రిక్రూట్మెంట్ కోసం ఈ ఇద్దరు పని చేస్తున్నట్లు కూడా తెలిపారు. ఆర్కే భార్యతో పాటు దొడ్డు ప్రభాకర్ ను కూడా అరెస్టు చేశామని, వీళ్లకు మావోయిస్టు సంస్థల నుంచి నిధులు అందుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Tags:
Next Story
Share it