Vijayanagaram : అంతర్జాతీయ పోటీలలో బంగారు పతకాన్ని సాధించిన విజయనగరం కానిస్టేబుల్!

పల్లెటూరికి చెందిన ఒక సాధారణ కానిస్టేబుల్, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని మన భారత దేశానికి బంగారు పతకం తీసుకొచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం పి ఆర్ పేట గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నాయుడు ఇటీవలే థాయిలాండ్ ఇంటర్నేషనల్ 28 మాస్టర్టిక్స్ స్పోర్ట్స్ లో పాల్గొన్నారు.

Vijayanagaram : అంతర్జాతీయ పోటీలలో బంగారు పతకాన్ని సాధించిన విజయనగరం కానిస్టేబుల్!
X

న్యూస్ లైన్, విజయనగరం : పల్లెటూరికి చెందిన ఒక సాధారణ కానిస్టేబుల్, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని మన భారత దేశానికి బంగారు పతకం తీసుకొచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం పి ఆర్ పేట గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నాయుడు ఇటీవలే థాయిలాండ్ ఇంటర్నేషనల్ 28 మాస్టర్టిక్స్ స్పోర్ట్స్ లో పాల్గొన్నారు. ఈ పోటీలలో ఆయన పోల్ వాల్డ్ ప్రదర్శనలో అద్భుతమైన ప్రతిభని కనబర్చి బంగారు పతకం ని అందుకున్నారు. ఒక సామాన్య వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన నాయుడు, తన పట్టుదలతో సాధించిన ఈ విజయాన్ని చూసి అందరూ గ్రామస్తులు ఎంతో సంతోషిస్తున్నారు. నాయుడు లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్తులో కుర్రాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని గర్వంగా చెప్పుకుంటున్నారు. నాయుడు కేవలం ఈ ఒక్క పోటీలోనే కాదు, గతం లో ఆయన ఇలా ఎన్నో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని, తన సత్తా చాటారు. ప్రభుత్వం ఇతని ప్రతిభ ని గుర్తించి మన ఆంధ్ర ప్రదేశ్ తరుపున ఒలంపిక్స్ కి పంపే ప్రయత్నం చెయ్యాలని పలువురు ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags:
Next Story
Share it