Vizag : కెమెరా కోసం వెడ్డింగ్ ఫొటో గ్రాఫర్ ని దారుణ హత్య!

విశాఖ ప్రాంతానికి చెందిన ఫోటో గ్రాఫేర్ సాయి కుమార్ అనే 23 ఏళ్ళ కుర్రాడు రావులపాలెం లో దారుణ హత్యకు గురయ్యారు.

Vizag : కెమెరా కోసం వెడ్డింగ్ ఫొటో గ్రాఫర్ ని దారుణ హత్య!
X

న్యూస్ లైన్, విశాఖపట్నం : విశాఖ ప్రాంతానికి చెందిన ఫోటో గ్రాఫేర్ సాయి కుమార్ అనే 23 ఏళ్ళ కుర్రాడు రావులపాలెం లో దారుణ హత్యకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఫేస్ బుక్ లో షణ్ముఖ తేజ అనే యువకుడు సాయి కుమార్ కి మెసేజి చేసి వెడ్డింగ్ ఫోటో షూట్ చెయ్యాలని పిలిచారు. అతను ఇచ్చిన అడ్రస్ ప్రకారం సాయి కుమార్ అక్కడికి చేరుకోగా, షణ్ముఖ తేజ తన స్నేహితుడితో కలిసి సాయి కుమార్ పై దాడి చేసి, ఆ తర్వాత హత్య చేసి అతని వద్ద ఉన్న 15 లక్షల రూపాయిలు విలువ చేసే కెమెరా సామాగ్రిని దొంగలించారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది.

సాయి కుమార్ అక్క మాట్లాడుతూ 'రాజముండ్రి కి బస్సులో వెళ్ళాడో, ట్రైన్ లో వెళ్ళాడో తెలియదు. అక్కడికి వెళ్తున్నానని మాకెవ్వరికీ కూడా చెప్పలేదు. ఇక్కడికి వెళ్లే ముందే వేరే ఈవెంట్ కి ఒప్పుకున్నాడు. అక్కడికి వేళ్ళాడేమో అని ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడికి మీ అబ్బాయి రాలేదు, 15 రోజుల పాటు షూటింగ్ చేసే ఈవెంట్ ఒకటి రాజమండ్రి లో దొరికిందట, అక్కడి వెళ్ళాడు అని చెప్పారు. ఆ తర్వాత ఆరోజు సాయంత్రం మా పిన్ని అమ్మా నాకేదో అనుమానం గా ఉంది అమ్మా, నేను స్పందించకపోతే ఈ నెంబర్ కి ఫోన్ చెయ్యండి అని మెసేజి పెట్టాడు. ఆ పక్క రోజు ఫోన్ చేస్తే కలవలేదు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాము, పోలీసుల విచారణలో నా తమ్ముడు చనిపోయారని చెప్పారు' అంటూ బోరున విలపిస్తూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో నెటిజెన్స్ కి కంటతడి పెట్టించింది.

Tags:
Next Story
Share it