vishakapatnam : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆటోను ఢీ కొన్న లారీ

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో(vishakapatnam) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వస్తున్న ఆటోను ఓవర్ స్పీడ్‌తో వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది.

vishakapatnam : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆటోను ఢీ కొన్న లారీ
X

న్యూస్ లైన్, విశాఖ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో(vishakapatnam) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వస్తున్న ఆటోను ఓవర్ స్పీడ్‌తో వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటన గమనించిన స్థానికులు కంగుతిన్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారులు బేతనీ స్కూల్ విద్యార్థఉలుగా పోలీసులు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో 6 గురు విద్యార్థులు గాయపడగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it