సీఎం రేవంత్ రెడ్డి పై నిరసన తెలుపుతూ సమ్మెకు దిగిన ఆటో డ్రైవర్లు!

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ని వెనక్కి తీసుకోవాలి అంటూ ఆటో మరియు ఇతర ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో మజ్దూర్ సంఘ్ ఆద్వర్యం లో ఆటో డ్రైవర్లు మొత్తం ఆందోళన కార్యక్రమం మొదలు పెట్టారు.

సీఎం రేవంత్ రెడ్డి పై నిరసన తెలుపుతూ సమ్మెకు దిగిన ఆటో డ్రైవర్లు!
X

Hyderabad : తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పై అప్పుడే ఒత్తిడి ప్రారంభమైంది. ఒక పక్క రైతు బంధు డబ్బులు జమచేయాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధికారం లోకి రాగానే అమలు చేస్తామన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరోపక్క ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్ట్ ని రద్దు చేసి నెగటివిటీ ని మూటగట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి ఇప్పుడు కొత్త సమస్య ఒకటి వచ్చి పడింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం రేవంత్ సర్కార్ కి మేలు చెయ్యడం కంటే కూడా ఎక్కువ నష్టాన్ని చేస్తుందనే చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ని వెనక్కి తీసుకోవాలి అంటూ ఆటో మరియు ఇతర ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో మజ్దూర్ సంఘ్ ఆద్వర్యం లో ఆటో డ్రైవర్లు మొత్తం ఆందోళన కార్యక్రమం మొదలు పెట్టారు.

ఆటో డ్రైవర్లు మొత్తం భారీ ర్యాలీగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బస్ భవన్ వద్దకు చేరుకున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సు లో ఉచిత ప్రయాణం వల్ల తమకు గిరాకీలు మొత్తం తగ్గిపోయాయని, ఆదాయం లేకుండా కుటుంబాలు మొత్తం పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది అంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బస్ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు చేరుకొని లోపలకు చొచ్చుకువెళ్ళే ప్రయత్నం చేసారు. ఆర్టీసీ అధికారులకు శాంతియుతంగా వినతి పత్రం అందచేస్తామని పోలీసులను రిక్వెస్ట్ చేసినా, పోలీసులు కనికరించలేదు. దీంతో వాగ్వాదం మరియు తోపులాట జరిగి కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే తమకి న్యాయం చేస్తుందని నమ్మి ఓటు వేశామని, కానీ ఓటు వేసినందుకు మా పొట్ట కొడుతున్నారని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందిస్తాడో లేదో అనేది చూడాలి.

Tags:
Next Story
Share it